తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో కొంత మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి కార్యకలాపాలకు సంబంధించి ఆయన ఎక్కువగా ఆరా తీస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. కొంతమందిని ఆయన పార్టీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే కొంతమంది కీలక నేతలను ఆయన ఇప్పుడు టార్గెట్ చేశారని తెలుస్తోంది.

అలాగే కొంత మంది మంత్రుల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ మీద ఫోకస్ చేశారు. గంగుల కమలాకర్ జిల్లాలో అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో ఆయన మీద దృష్టి పెట్టిన బండి సంజయ్ త్వరలోనే పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో కూడా బండి సంజయ్ ఇదే విధానం కొనసాగిస్తే మాత్రం చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పుడు వస్తున్న మరికొన్ని వార్తల ఆధారంగా చూస్తే ఇద్దరు ముగ్గురు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. అయితే కొంతమంది అగ్రనేతలకు సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ బిజెపి అధిష్టానం నేతలకు కూడా కొన్ని సూచనలు చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలోకి ఎవరు వెళ్తారు అనే దానిపై స్పష్టత లేకపోయినా ఒక ముగ్గురు నేతలు మాత్రం కచ్చితంగా పార్టీ మారవచ్చని అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ లోకి వెళ్ళిపోయి అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: