కొన్నాళ్లుగా సైలంట్‌గానే ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కొత్తగా మరో బాంబు పేల్చారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు మార్చిలో జరుగుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఎక్కడ ఆగిపోయిన ప్రక్రియ అక్కడి నుంచే మొదలవుతుందని నిర్ణయించారు. ఇది వైసీపీకి అనుకూలమైన నిర్ణయమే. అయితే తాజాగా నిమ్మగడ్డ మరో బాంబు పేల్చారు. గతంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు.. ఎవరైనా తమను బలవంతంగా ఉపసంహరించామని ఫిర్యాదు చేస్తే మాత్రం పరిశీలిస్తామని ప్రకటించారు నిమ్మగడ్డ.

నగర, పురపాలక సంస్థ ఎన్నికలపై అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈమేరకు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో మొబైల్ స్వాడ్స్ చురుకుగా పనిచేస్తాయన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికలను ప్రభావితం చేసే వారిపై ప్రత్యేక నిఘా వేస్తామన్నారు. బలవంతపు విత్ డ్రా కేసులను స్వయంగా అభ్యర్థి వచ్చి అడిగితే పరిశీలిస్తామని నిమ్మగడ్డ ప్రకటించారు.


నామినేషన్ వేయకుండా అడ్డుకున్న కేసుల విషయంలో రుజువులు, ఆధారాలు చూపిస్తే వారి విషయాన్ని మరోసారి పరిశీలిస్తామని కూడా నిమ్మగడ్డ అంటున్నారు. ప్రభుత్వ రేషన్ వాహనాలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. పంచాయతీ ఎన్నికలు అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని నిమ్మగడ్డ చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చర్యలు తీసుకుంటామని.. మునిసిపల్ ఎన్నికల్లో కూడా వాలంటీర్ల వినియోగం ఉండబోదని నిమ్మగడ్డ అన్నారు.  

మునిసిపల్ సిబ్బంది ఓటరు  స్లిప్పుల పంపిణీ చేస్తారని.. ఇందుకోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసేలా చర్యలు తీసుకొంటామని నిమ్మగడ్డ తెలపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించిన ఎన్నికల నియమావళి రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్న నిమ్మగడ్డ.. అభ్యర్థితో పాటు ఐదు మందికి మించి ఇంటింటి ప్రచారం చేయకూడదని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: