ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే కుప్పం లో పర్యటనలో భాగంగా అక్కడి కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీర్ ను రాజకీయాల్లోకి తీసుకొని రావాలని అక్కడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనితో చంద్రబాబు ఊహించని  పరిణామం ఎదుర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ తతంగమంతా ఎప్పుడూ ఉండేదే ఎన్నికల్లో ఎప్పుడు టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించాలని డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది.


 అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వైసీపీ నేతలు కూడా కామెంట్లు ఏం చేస్తున్నారు. టీడీపీ నేతల పై సెటైర్లు వేస్తున్నారు. వైసిపి ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే నేరుగా నారా భువనేశ్వరి కి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పం లో తిష్ట వేశారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి తీసుకెళ్లి ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.


 కానీ ఇప్పుడు వరుస ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకున్నాడు అంటూ ధ్వజ మెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి అని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలన్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ భజన ప్రారంభమైంది అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తానే గెలిచామని టపాసులు కాల్చడం చాలా విడ్డూరంగా ఉందని అంబటి విమర్శించారు. టిడిపి ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైసీపీ జెండా గుర్తు చేశారు.


 చంద్రబాబు తన వద్ద అని చెప్పుకునే కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయితీలు  మాత్రమే గెలిచింది అని విమర్శించారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్ళని చంద్రబాబుని సొంత నియోజకవర్గానికి వెళ్లేలా తమ అధినేత జగన్ చేశారు అని అంబటి అన్నారు. మున్సిపల్ ఎన్నికల పేరుతో పచ్చ కాగితాల  మేని పెస్టో రిలీజ్ చేశారని మరి 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒకటి అన్న అమలు చేశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అది అమలు చేయలేని చంద్రబాబు అధికారంలో లేనప్పుడు హామీల అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇక లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అయినా అర్థం అవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తనయుడి విషయంలో భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా అంటూ సెటైర్లు వేశారు. తమ కుమారుడిని ఎవరికైనా చూపించండి అంటూ సలహా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: