స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల మద్దతు లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్వయంగా సీఎం జగన్ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. మొన్నటి వరకు రిలే దీక్షల కే పరిమితమైన కార్మిక విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఉద్యమానికి మరో రూపం ఇవ్వాలి నిర్ణయించాయి. ఇటీవల ప్రధాని మోదీ వాక్యాలతో ఇక స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించక తప్పదని ప్రధాని స్పష్టం చేశారు.


 మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, ప్రైవేట్  బిడ్ దాఖలు చేసేందుకు కావలసినటువంటి టెక్నికల్ వివరాలతో పాటుగా ప్లాన్ సంబంధించిన పూర్తి వివరాలను లాభనష్టాలను అనే వివరాలను పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా ఉన్నత అధికారులను కోరినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నా యన్నది వాస్తవం. దీంతో కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో తమ నినాదం వినిపించాలని అనుకుంటున్నాయి. ఇతర పార్టీలను కూడా తమ ఉద్యమంలో కలుపుకొని రాజకీయ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.


 స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల మద్దతు లభిస్తోంది. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంలో భాగం అవుతున్నాయి.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్వయంగా జగన్ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. ఎంపీ విజయసాయి రెడ్డి సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో పాదయాత్ర చేశారు. అయితే వైసీపీ ది డబుల్ స్టాండ్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాట ఢిల్లీలో ఒక మాట ఆ పార్టీ మాట్లాడుతూ ఉందని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకానితనం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు.


 22 మంది ఎంపీలు నెగ్గిన ప్రత్యేక హోదా ఎందుకు తీసుకు రాలేక పోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అడ్డు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి పార్లమెంట్ కమిటీలో ఎంపీ అవినాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారని అయినా ఆ నిర్ణయానికి ఎందుకు అడ్డు చెప్పలేకపోయాను లోకేష్ ప్రశ్నించారు.  కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ ప్రైవేటీకరణ లో అసలు దోషి వైసీపీనే అని లోకేష్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: