విశాఖలో ఓ రాజకీయ నాయకుడు ఉన్నారు. ఆయన చాలా దుర‌దృష్ట వంతుడే అనుకోవాలి. ఆయ‌న 12 సంవ‌త్స‌రాలుగా ఒకే ఒక్క ప‌ద‌వి కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఆ ప‌ద‌వి ఇప్ప‌ట‌కీ చిక్క లేదు. ఈ సారి అయినా వ‌స్తుందా ? అంటే ఊరిస్తూ వ‌స్తోంది. బొమ్మ‌న‌బోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌. విశాఖ న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు. గంటా శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న 2009లో విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌పై స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు.

2014లో వైసీపీ నుంచి పోటీ చేసి అదే వెల‌గ‌పూడిపై 47 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న విశాఖ వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉంటూ వ‌స్తున్నారు.  2019 ఎన్నికల నాటికి వైసీపీకి గ్యారంటీ అధికారం అనుకున్న వేళ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది. భీమిలి నుంచి తీసుకు వ‌చ్చిన అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌కు సీటు ఇవ్వ‌గా.. ఆమె వెల‌గ‌పూడి చేతిలో ఓడిపోయింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వంశీకి మేయ‌ర్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

గ‌తేడాదే ఆయ‌న మేయ‌ర్ అవుతాన‌ని క‌ల‌లు క‌న్నారు. క‌రోనాతో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఉక్కు ఎఫెక్ట్ తో విశాఖ‌లో వైసీపీ గెలుస్తుందా ? అన్న సందేహానికి తోడు ర‌క‌ర‌కాల కార‌ణాలు విశాఖ‌లో వైసీపీ ప‌రిస్థితి ట‌ఫ్ చేసేశాయి. వంశీ త‌న‌ స్థాయి దిగి మరీ కార్పోరేటర్ గా పోటీ చేస్తున్న చోట కూడా ట‌ఫ్ ఫైట్ ఉందంటున్నారు. వంశీ కార్పొరేట‌ర్‌గానే అక్కడ గెలవడానికే కష్టపడుతున్నారు. ఆ మీదట వైసీపీకి మెజారిటీ డివిజన్లు రావాలి. అన్నీ జరిగినా వైసీపీ పెద్దల నిర్ణయంలో ఏ మార్పు లేకుండా ఉండాలి. దీంతో ప‌లు మార్లు మంచి అవ‌కాశాలు మిస్ చేసుకున్న వంశీకి ఈ సారి అయినా మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కుతుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: