జగన్ తాను ముప్పయ్యేళ్ళ సీఎం అని చెబుతూ ఉంటారు. తాను ఒక్కసారి అధికారంలోకి రావాలే కానీ మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ప్రజా సేవ చేసి తీరుతాను అని గట్టి శపధాలే అప్పట్లో చేశారు. మొత్తానికి పదేళ్ల పరిశ్రమ తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం గా  కుర్చీ ఎక్కి రెండేళ్ల కాలం దగ్గరపడుతోంది.

సంక్షేమ మార్గాన జగన్ పయనిస్తున్నారు. ఆ ఫలితాలు తమకు సంతృప్తిగా ఉన్నాయని పల్లె జనం జై కొట్టారు. ఇక పట్టణ జనాలు తమ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే జగన్ మళ్ళీ మళ్ళీ గెలవాలనుకుంటున్నారు. అవతల వైపు చూస్తే జగన్ ది గాలి వాటం గెలుపు అని టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎపుడు ఎన్నికలు జరిగినా జగన్ ఓడిపోతారని కూడా ప్రచారం చేస్తున్నాయి. అదే విధంగా చూస్తే జనసేన కూడా ఈ మధ్య బాగానే సౌండ్ చేస్తోంది. ఏపీలో మార్పు తధ్యమని కూడా ఘంటాపధంగా చెబుతోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ పంచాయతీలు గెలిచి తన ప్రభుత్వం మీద జన విశ్వాసం బాగానే ఉందనిపించుకున్నారు.

అయితే అది మాత్రమే సరిపోదు, ఇంకా పరీక్షలు ముందు ఉన్నాయి. పట్టణ ప్రాంత ఓటర్ల అభిప్రాయం కలిస్తేనే తప్ప జగన్ కి వచ్చిన విజయం సంపూర్ణం కాదు, అది జరగాలంటే మునిసిపల్ పోల్స్ రిజల్ట్ వరకూ ఆగాల్సిందే. పట్టణాల ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. మరి వైసీపీ పాలన నచ్చితే వారు ఫ్యాన్ గుర్తుకే ఓట్లేస్తారు. లేకపోతే మాత్రం ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తారు.  ఫలితాలు కనుక వస్తే రెండింటినీ బేరీజు వేసుకుని 2024 ఎన్నికలలో జగన్ కి రెండవసారి అధికార యోగం ఉందా లేదా అన్నది చెప్పేయవచ్చునని రాజకీయ విశ్లేషకులు సూత్రీకరిస్తున్నారు. మొత్తానికి చూస్తే జగన్ జాతకం మరో పక్షం రోజుల్లో తెలిపోతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: