ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను ఎంత బలంగా అందిస్తున్న సరే ప్రజల్లోకి వెళ్లే విషయంలో మాత్రం చాలా మంది వైసీపీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీలో సమర్థవంతంగా ముందుకు నడిపించవలసిన చాలామంది నేతలు వెనకడుగు వేస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రి జగన్ కూడా కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

ఇప్పటివరకు సినీ నటుల మీద పెద్దగా ఆధారపడని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచి సినీ నటుల మీద ఆధార పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సినీనటులహో ప్రచారం చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మాజీ హీరోయిన్ల తో వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో సమావేశం కూడా అయినట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం చేయాలని కొంతమంది మాజీ హీరోయిన్లను కోరుతున్నారట. ఈ మేరకు రమ్యకృష్ణతో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం.

అధికారులు కూడా ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి ఆమె ద్వారా ప్రచారం చేయించే విధంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రభావాన్ని వైసిపి నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే సినీ నటుల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరికొంత మంది మాజీ హీరోయిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయించి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఇటీవల సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమై ఇదే అభిప్రాయాలు చెప్పారని అంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు విజయవంతంగా ముందుకు నడిపిస్తారు ప్రజల వద్దకు ఎంతవరకు ప్రచారం వెళ్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: