ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ్డా కొద్దీ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. హైద‌ర‌బాద్‌లో ఆ వేడి కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. ఉద్యోగాల భ‌ర్తీ చుట్టూతే రాజ‌కీయ వేడి కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం 1ల‌క్ష 32వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన‌ట్లుగా అధికారికంగా లెక్క‌లు చూపుతుంటే.. కాంగ్రెస్ స‌హా ఇత‌ర పక్షాలు, వివిధ కార్మిక‌, ఉద్యోగ‌, నిరుద్యోగ‌, విద్యార్థి సంఘాల నేత‌లు మాత్రం క‌చ్చితంగా ఇవి త‌ప్పుడు లెక్క‌లు అంటూ తీవ్ర‌స్తాయిలో వాదిస్తున్నారు. ఎక్క‌డ చూసిన స‌ర్వ‌త్రా ఇదే అంశంపైనా చ‌ర్చ సాగుతోంది. అయితే ఈక్ర‌మంలోనే అధికారిక ప్ర‌తిప‌క్షాల‌తో పాటు వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారు తీవ్ర‌స్వ‌రంతో మాట్లాడుతుండ‌టం విశేషం.


త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అయితే దాసోజు శ్ర‌వ‌న్‌ను ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం. . కేటీఆర్‌ చెప్పిన అంకెలపై చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసరడంపై తలసాని ఘాటుగా స్పందించారు.మంత్రి కేటీఆర్కు సవాల్ చేసే స్థాయి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కు లేదని  అన్నారు. ఉద్యోగాల లెక్కలపై కేటీఆర్ను శ్రవణ్ నిలదీయడంపై మండిపడ్డారు. ‘‘నిన్న ఓ గొట్టంగాడు గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని.. నేను ఇక్కడున్నాను.. ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ రావాలె అంటూ మాట్లాడిండు.


మంత్రి రావాలంటే.. వస్తడా? అతనిది కేటీఆర్కు సవాల్ విసిరేటంత స్థాయి కాదు. అలాంటి వాళ్లకు మేం సమాధానాలు చెప్పం” అని తలసాని కామెంట్ చేశారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇదిలా ఉండ‌గా ‘‘తలసాని బుద్ధిలేని సన్నాసి. తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్కు ఏం సంబంధం. ఆ ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్ యాదవ్తో తిట్టించటం కేటీఆర్ కు తగదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ బిచ్చగాడు తలసాని. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడితే గొట్టంగాళ్లంటూ కామెంట్లు చేస్తరా? ఈ గొట్టంగాళ్లే మీకు కర్రుకాల్చి వాత పెడ్తరు” అంటూ  ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కౌంట‌ర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: