ఎవరెన్ని చెప్పినా సరే రాజకీయాల్లో వ్యూహకర్తల ప్రభావం అనేది గత కొంత కాలంగా పెరిగింది అనే మాట వాస్తవం. కొంతమంది ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలను శాసిస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న పార్టీల మీద వాళ్లు పెత్తనం చెలాయించడం అలాగే అధినేతల వద్ద మంచి పేరు తెచ్చుకుని ముందుకు వెళ్లడం ప్రభుత్వాలను తమ చేతుల్లో పెట్టుకుని వ్యవహరించటం వంటివి జరుగుతున్నాయి. బీహార్ లో   నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశాంత్ కిషోర్ నడిపారు.

 2014 నుంచి 2018 వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశాంత్  పరోక్షంగా శాసించారు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశాంత్ శాసించిన పరిస్థితి కనపడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అగ్ర నేతలు కూడా ఇప్పుడు ఆయన ద్వారా రాజకీయం చేసే అవకాశాలు కనబడుతున్నాయని అంటున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారి మీద ఆధార పడే అవకాశాలున్నాయని అంటున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యూహకర్తను తెచ్చుకుని ఆలోచనలో ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైసీపీని ఎదుర్కోవడానికి కూడా ఇప్పుడు వ్యూహకర్తను నమ్ముకునే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియదు. కానీ త్వరలోనే కొంతమంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం వారిని నమ్ముకోవడం కాస్త ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: