ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొన్నీ మధ్య జరిగిన పంచాయితీ ఎన్నికలు రసాభాసగా సాగాయి. అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు మరో కొద్ది రోజుల్లో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు కుప్పం లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కుప్పం వైకాపా ఇన్‌ఛార్జి భరత్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయం లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.


కుప్పం నుంచి ఏడుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైన చంద్రబాబు ఏడాది తరువాత కుప్పంలో పర్యటిస్తుంటే తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఆశించారని, అయితే కేవలం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూసి డీలాపడిన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపడం తోనే సరిపోయిందన్నారు. పార్టీని ఎలా నియాబెట్టుకోవాలని చూస్తున్నాడు తప్ప ప్రజలు సమస్యలు అవసరం లేదని మాటలు వినిపించాయి. దీంతో అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని పలువురు కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం కనిపించింది.


పంచాయితీ ఎన్నికల ఫలితాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు గాను  మొదట గుడుపల్లె మండలం లో పర్యటించిన చంద్రబాబు కు ఊహించని దెబ్బ తగిలింది. కార్యకర్తలకు మీరేం చేశారు అంటూ పలువురు పార్టీ నేతలు నిలదీయడం తో షాక్‌కు గురయ్యారు. ఆపై శుక్రవారం కూడా ఇదే అనుభవం ఎదురవడం తో ఏం సమాధానం చెప్పాలో తెలియక మూడు రోజుల పర్యటనను మధ్య లోనే నిలిపేశారు. బాబు పర్యటన లో అడుగడుగునా జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు వినిపించడం తో బాబు అక్కడ ప్రజలకు మొహం చూపించలేక స్వగృహానికి బయలు దేరాడు.. ఇలాంటి అనుభవాలు బాబుకు గతంలో కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: