మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దెబ్బకు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నాయి. ఆయన ఏ పార్టీ లోకి వెళ్తారు అర్థం కాక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సతమతమౌతున్నారు. అయితే చంద్రబాబునాయుడు ఈ మధ్యకాలంలో ఆయనతో కాస్త ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే గంటా శ్రీనివాసరావు ని భారతీయ జనతా పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత వైసీపీ లోకి వెళ్ళే అవకాశం ఉందని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఒకరు కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ మారకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ మారితే కచ్చితంగా బిజెపిలోకి రావాల్సిందేనని బీజేపీ నేతలు షరతులు పెడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అగ్రనేతల తో ఇప్పటికే ఆయన చర్చలు జరిపారని సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది చర్చలు జరుపుతున్న సరే ఆయన నవ్వి ఊరుకున్నారు. కాని అసలు విషయం చెప్పడం లేదని అంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు విషయంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఒక రాజ్యసభ ఎంపీ తీవ్రం గా కష్టపడటం తో వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.

గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే వైసీపీకి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అవంతి శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఇబ్బంది పడవచ్చు. అలాగే గంటా శ్రీనివాసరావు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: