టిడిపిలో కొంతమంది అగ్రనేతలకు సంబంధించి మనం ఎక్కువగా చర్చలు చూస్తూ ఉంటాం. ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయితే కేసినేని నాని విషయంలో పార్టీ అధిష్ఠానం కాస్త జాగ్రత్త పడుతున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీ మారితే మాత్రం విజయవాడలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇబ్బంది పడుతుంది.

అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆయన విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయన విషయంలో ఏం జరుగుతుంది ఏంటనే దానిపై ఆసక్తి కరంగా చూస్తుందని సమాచారం. ఒకవేళ ఆయన పార్టీ మారితే ఆయనను పార్టీ మారకుండా ఉండేందుకు కాస్త తీవ్రంగానే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. అయితే ఏకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కేసినేని నాని తో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలకు కూడా పార్టీపై అనేక అభిప్రాయాలున్నాయి. పార్టీ ఏ విధంగా గెలుస్తుంది ఏంటనేది అర్థం కావడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే చాలామంది కీలక నేతలు ఇప్పుడు కేసినేని నాని పార్టీ మారకుండా ఉండేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి నానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. అయితే ఆయనతో ముందుకు వెళ్లాలేని నేతల మీద చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కానీ విజయవాడ నుంచి మళ్లీ పార్లమెంట్ సీట్ కి మిమ్మల్ని ఎంపిక చేస్తామని మీరు గెలిచే విధంగా మేము సహకరిస్తామని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నేతలు చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: