తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండడం పై టిడిపి అధిష్ఠానం కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పాలి. గత కొంతకాలంగా వెలగపూడి రామకృష్ణ పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మొన్నటి వరకు కూడా ఆయన కాస్త రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టేలా విమర్శలు చేశారు. అలాగే విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి పై కూడా ఆయన అసహనం గానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన టార్గెట్గా విమర్శలను గట్టిగానే చేసిన వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

 ఎందుకు ఏంటనేది స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ తో భారతీయ జనతా పార్టీ చర్చలు  జరుపుతుందని సమాచారం. ఎందుకు అనేది తెలియదు.. కానీ ఆయన విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని కొంత మంది వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ నేతల విషయంలో ఆయన ఒంటికాలిపై లేచే పరిస్థితి ఉంటుంది. అందుకే భారతీయ జనతా పార్టీ నేతలు ఆయనతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

మారిన సరే భారతీయ జనతా పార్టీ లో మంచి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అవసరమైతే రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. మూడుసార్లు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధిష్టానం నేతలు అందరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపుగా ఉగాది రోజున ఆయనతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: