టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంను కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తర్వాత చాలావరకు సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ ఆయన విషయంలో మాత్రం ఇప్పటికీ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో చాలా మంది వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు దాదాపు ఆరు నెలల నుంచి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించడం అలాగే అధికార వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే అనుకున్న విధంగా విజయం సాధించలేకపోవడంతో చంద్రబాబు నాయుడు వైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చూస్తోందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపించాయి

భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి సిద్ధమవుతున్నారు. అయితే త్వరలోనే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ స్నేహం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ఎంత వరకు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ తో కలిసి ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు బిజెపి కి దగ్గర అయితే మాత్రం వైసీపీ చాలా వరకు ఇబ్బందులు పడవచ్చు. గతంలో ఉన్న రాజకీయానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: