టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఖరి విషయంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు అసహనంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. చాలా మంది యువకులకు ఆయన అవకాశాలు ఇవ్వడం లేదు అనే భావన రాజకీయవర్గాల్లో ముందు నుంచి కూడా ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే నారా లోకేష్ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ఈ విషయంలో సీనియర్ లు ఇబ్బంది పడుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొంతమంది నాయకులు ఆయన విషయంలో బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారని ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో నారా లోకేష్ ఉంటే పాల్గొనేది లేదు అని కొంతమంది నేతలు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు నారా లోకేష్ కొంతమంది విషయంలో కాస్త సీరియస్ గానే వెళ్తున్నారు అని అంటున్నారు. తనకు సహకరించిన సీనియర్ నేతలకు నారా లోకేష్ త్వరలోనే చెక్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

ప్రధానంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురు కీలక నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారు అని ఇటీవల తాను పర్యటన చేసిన సరే వాళ్ళు దూరంగా ఉన్నారు అని గ్రహించిన నారా లోకేష్ వాళ్ళను పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. చాలామంది కీలక నేతలు కూడా  లోకేష్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. మరి దీని నారా లోకేష్ ఎలా అధిగమిస్తారు పార్టీని ఎంత వరకు ముందుకు తీసుకువెళ్తారు అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే నారా లోకేష్ దెబ్బకు కొంతమంది సీనియర్ నేతలు పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. మరి దీని నారా లోకేష్ ఎంత వరకు సమర్థవంతంగా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: