ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార వైసిపికి అభ్యర్థులు లేరు అనే ఆరోపణలను నారా లోకేష్ కాస్త గట్టిగా చేస్తున్నారు. వాస్తవానికి ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకని ఆరోపణలను వైసీపీ నేతలు చేస్తూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళను ఇప్పుడు అధికార వైసీపీ నేతలు పార్టీలోకి తీసుకోవడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమ జిల్లాల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ నేతలు తమ పార్టీలో జాయిన్ చేసుకోవడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఆయన దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనలో అధికార పార్టీకి అభ్యర్థులు లేరు అనే అంశాన్ని ఆయన ప్రధానంగా హైలెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అభ్యర్థులు లేక టిడిపి అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు అని ఆయన ఆరోపించారు. పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ కు తాడేపల్లి కొంప  గేటు దాటి వస్తే జనం తంతారని భయం అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

 వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం అని ఎద్దేవా చేసారు. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు అని ఆయన ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టిడిపి అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. నువ్వొక నాయకుడివి నీదొక పార్టీ... అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ అంటూ ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: