కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఏంటి అని దానిపై ఇప్పటి వరకు కూడా స్పష్టత రావడం లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ రాజీనామా చేసి రెండేళ్లు అవుతున్న సరే ఇప్పటివరకు జాతీయ అధ్యక్షుడుని ఎంపిక చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ లో ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. ఎంతమంది అడిగినా సరే తాను మాత్రం పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా లేనని రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయినా సరే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో ఉన్న సాన్నిహిత్యంత్య్హో పార్టీ అధ్యక్ష బాధ్యతల ను చేపట్టాలని పలుమార్లు కోరినా ఆయన మాత్రం ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. 23 మంది పార్టీ సీనియర్ నేతలు తాజాగా సమావేశమయ్యారు. పార్టీలో తమకు అన్యాయం జరుగుతుందని ఆజాద్ కు మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ కారణంగా తాము పార్టీలో ఉండలేక పోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ నేతలు చాలామంది ఇలా అనడం తో పార్టీ అధిష్టానం కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది అని చెప్పాలి. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక జరగకపోగా అసలు అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతోంది. పార్టీలో ఉన్న యువ నాయకత్వం కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. మరి ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బయటకు వస్తుంది ఏంటి అనేది చూడాలి. భవిష్యత్తులో కూడా కొనసాగితే ఇబ్బందులు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: