పశ్చిమ బెంగాల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా సరే విజయం సాధించే విధంగా అడుగులు వేస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు ఇబ్బందులు సృష్టిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ ఎన్నికలకు సంబంధించి 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీపై మరింత వేగంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తరహాలో శాసనసభ ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నారు అని తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా వాడుకుని భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ఘాటుగానే స్పందించింది. 2016 లో జరిగిన ఎన్నికల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అని ఇప్పుడు ఎనిమిది దశల్లో జరుగుతున్నాయని తాము బాధ్యతగానే చేస్తున్నాం రాజకీయాలు వద్దు అని ఎన్నికల సంఘం  క్లారిటీ ఇచ్చేసింది.

అయితే దీనిపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణ ఎంత వరకు ప్రశాంతంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఎన్నికల సంఘం ఇబ్బంది పడవచ్చు. 2019 ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలవడం2016 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పశ్చిమబెంగాల్లో గెలుచుకోవడం జరిగాయి. దీంతో అసలు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది... మమతాబెనర్జీ ఏ విధంగా ఎదుర్కొని నిలబడుతుంది అనేది చూడాలి. మే 2 న ఫలితాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: