విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల వేళ వైసీపీ కి షాక్ తగిలింది. వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి బోను రాజేష్ రాజీనామా చేసారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఓదార్పు యాత్రలో విజయవాడలో జగన్ తో కండువా కప్పించుకుని పార్టీ చేరా అని అన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పని చేసా అని పేర్కొన్నారు. 2014 లో తెదేపా అభ్యర్థి పై స్వల్ప ఆధిక్యంతో ఒడిపోయా అని గుర్తు చేసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధ వెళ్ళిపోయాక ఇంచార్జిగా మల్లాది విష్ణు వచ్చారు,ఆయన వద్ద కూడా పని చేశా అని అన్నారు.

నేను ఇదివరకు పోటీ చేసిన వార్డు ఇప్పుడు బీసీ అయింది, సీట్ ఇస్తారునుకున్న అని, ఒక బీసీ అభ్యర్థిగా పోటీలో నిలబడదామనుకున్నాను అని, నన్ను పక్కన పెట్టి వేరే వారికి ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం ఈ వార్డు కాకపోయినా నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం పని చేసినా గుర్తించలేదు అని అన్నారు. పాత 53 కొత్త 30 వ వార్డులో అభ్యర్థి చనిపోతే ఎక్కడైనా అవకాశం ఇవ్వమని అడిగా అది ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.

నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.  ఇంకా పార్టీలోనే ఉంటే ఎదుగుదల ఉండదని భావిస్తున్నా అని, పార్టీకి పని చేసిన వ్యక్తిని కాదని కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు అని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే సమాధానం వచ్చింది అని, రాజధాని నగరమైన విజయవాడలో ఒక బీసీ కి టికెట్ ఇవ్వని పరిస్థితి అని ఆయన ఆరోపించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. జగన్ దాకా ఈ అంశాలను తీసుకువెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు అని అన్నారు. పార్టీ నన్ను గుర్తించడం లేదు కాబట్టి పార్టీని వీడా అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: