కోవిడ్ నియంత్రణలో ముఖ్య ఘట్టం లోకి వెళ్తున్నాం అని తెలంగాణా డిహెచ్ శ్రీనివాస రావు అన్నారు. 4లక్షల 75 వేలకు పైగా వ్యాక్సిన్ డోస్ లు ఇచ్చాము అని ఆయన పేర్కొన్నారు. మార్చ్ 1 నుంచి కమ్యూనిటీ లో వ్యాక్సినేషన్ చేస్తామని తెలిపారు. 60 ఏళ్లు పై బడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉంది దీర్ఘ కాలిక వ్యాదుకు ఉన్నవారికి వాక్సినేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ రెండు వర్గాలకు సంబంధించి సుమారు 50 లక్షల మంది ఉంటారని గుర్తించామని చెప్పారు. కోవిన్ వెర్షన్ 2 ఈ రోజు సాయంత్రంలోపు అందుబాటులోకి వచ్చే అవకాశం అని అన్నారు.

రేపు 102 కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తామని, 45 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్  చేస్తామని వివరించారు. ప్రతి జిల్లాల్లో 2 , హైదరాబాద్ లోని12 కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ప్రైవేట్ లో రేపు 57 ప్రైవేట్ లో వాక్సినేషన్ అని వెల్లడించారు.  రేపు కేవలం ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వాక్సినేషన్ అని స్పష్టం చేసారు.  కోవిన్ 2.0 వెబ్ సైట్ లో  మొబైల్ లేక ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఆధార్ లేక ఫోన్ నెంబర్ ఇస్తే ఓటిపి వస్తుంది. దానిని వెబ్ సైట్ లో ఎంటర్ చేసి  డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు అని తెలిపారు.

 రిజిస్ట్రేషన్ తరువాత మీ మొబైల్ కి వచ్చిన లింక్ ద్వారా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని సూచించారు. అదే వ్యాక్సిన్ కేంద్రాల్లో మొదటి డోస్ అయిన వెంటనే రెండో డోస్ కోసం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అని తెలిపారు.  మొబైల్ లింక్ ద్వారా వాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు అని వివరించారు.  covin.gov. in లో రిజిస్టర్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: