దేశంలో మార్చి 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. కొన్ని నిబంధనలు మారుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామా. పాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్ మీ ఫోన్‌లో ఇక పనిచేయదు. బ్యాంక్ ఇప్పటికే ఈ విషయాన్ని కస్టమర్లకు తెలియజేసింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ తన ఉద్యోగులకు, ఇతర అధికారులకు రూ.2,000 నోట్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఏటీఎంలలో రూ.2,000 నోట్లను పెట్టవద్దని బ్యాంక్ వాటి బ్రాంచ్‌లకు తెలియజేసింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో ఇక రూ.2000 నోట్లు కనిపించవు.

అంతేకాక డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ట్రాన్ ఎన్‌టీవో 2.0 రూల్స్‌‌ను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో యూజర్లకు తక్కువ ధరలోనే 200 ఫ్రీ ఎయిర్ టు ఛానెల్స్ అందుబాటులోకి వస్తాయి.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు తమ సేవలను కొనసాగించాలంటే కేవైసీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేకుంటే అకౌంట్ పని చేయదు. డిజిటల్ న్యూస్ సంస్థలు,సోషల్ మీడియా,ఓటీటీలకు కేంద్రం ప్రకటించిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ మార్చి 1 నుంచి అమలవుతుంది.

ఇక జీఎస్‌టీకి సంబంధించిన కొత్త రూల్ ఒకటి అమలులోకి వచ్చేసింది. లాటరీకి జీఎస్‌టీ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం.. లాటరీపై ఇక 28 శాతం జీఎస్‌టీ పడుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్ 2019 డిసెంబర్ నెలలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ లాటరీలపై 28 శాతం జీఎస్‌టీ పడుతుంది. దీంతో లాటరీలు మరింత ప్రియం కానున్నాయి.

అయితే పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేయడానికి, పీఎంఏవై క్రెడిట్ సబ్సిడి పొందేందుకు మార్చి 31 చివరి తేది. ఫాస్టాగ్ ను నేటి వరకు ఫ్రీగా ఇచ్చారు. మార్చి 1 నుంచి ఫాస్టాగ్ ను తీసుకునేందుకు నగదు చెల్లించాలి. ఫాస్టాగ్ కోసం రూ.100 పెట్టాలి. ఫాస్టాగ్ ద్వారా రీచార్జ్ చేయించుకోకుంటే ఇకపై మీరు ప్రయాణించే మార్గంలో అదనంగా ఫైన్ కట్టాల్సి ఉంది.

ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారుతున్నాయి. మార్చి 1 నుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ కస్టమర్లు పూర్తి స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లుగా మారుతారు. మార్చి 1 నుంచి విజయా, దేనా బ్యాంకులకు చెందిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ పనిచేయవు. కస్టమర్లు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం తప్పనిసరిగా కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: