దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ జనవరి 15 నుండి విరాళాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజలు, సెలబ్రెటీలు, వ్యాపార వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి విరాళాలు అందించారు. అయితే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27 తో పూర్తయ్యింది. కాగా ఇప్పటివరకు సేకరించిన మొత్తం డబ్బు రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొంత డబ్బు వచ్చిందని మరికొంత డబ్బు ఖాతాలో జమకావాల్సి ఉందని చెబుతున్నారు. దాంతో విరాళాల మొత్తం పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంధర్బంగా రామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ కార్యాలయ ఇంచార్జ్ ప్రక్షాష్ ఉప్తా మీడియా తో మాట్లాడారు. ఇప్పటి వరకు సేకరించిన విరాళాల మొత్తం 2వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మొత్తం ఎంత సేకరించామనేది తేలడానికి మరో నెల సమయం పడుతుందని అన్నారు.

ఆలయ నిర్మాణంల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుజునట్టు గతంలోనే వెల్లడించింది. 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల వద్దకు వెళ్లి విరాళాలు సేకరిస్తామని చెప్పినట్టుగానే..ట్రస్ట్ విరాలాలను సేకరించింది. అంతే కాకుండా కేవలం స్వదేశీ నిధులతోనే ఆలయ నిర్మాణం చేపడతామని ట్రస్ట్ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు ఆలయ నిర్మాణం కోడం రూ. 1100 కోట్లు ఖర్చు అవుతాయని ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు.   ప్రధాన ఆలయ నిర్మాణానికి 3 నుండి 4 వందల కోట్లు ఖర్చవుతాయని..ఆలయాన్ని మరో మరో ముడున్నారేళ్లలో పూర్తి చేయాలని అనుకున్నారు. అంతే కాకుండా ఆలయ నిర్మాణం లో ఐఐటీ లు మరియు ఇతర సంస్థలు సహాయం చేస్తున్నాయని..ఆన్లైన్ ద్వారా మరో 100 కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: