కరోనా.. కరోనా.. కరోనా.. ఏడాదిన్నరగా చిరాకు పెట్టిస్తున్న పేరు ఇది. కేరళలో మొదట అడుగు పెట్టి అటునుంచి అన్ని రాష్ట్రాలకు వ్యాపించిన ఈ కరోనా ఏకంగా లక్షల మందికి వ్యాపించింది. అలాంటి కరోనా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నా.. ఓ రాష్ట్రం నుంచి పూర్తిగా కరోనా వైదలగిందన్న వార్త చాలా ఆనందం కలిగిస్తోంది.

ఇంతకీ అది ఏ రాష్ట్రమో తెలుసా.. అదే అరుణాచల్ ప్రదేశ్..  తాజాగా కరోనా రహిత రాష్రంగా ఈ అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది. ఆ రాష్ట్రంలో మిగిలి ఉన్న ముగ్గురు కరోనా రోగులు కూడా పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం నాడు అరుణాచల్ ప్రదేశ్ కరోనా రహిత రాష్ట్రంగా మారిందని అక్కడి అధికారి వెల్లడించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఆ రాష్ట్ర రికవరీ రేటు 99.66 శాతంగా ఉంటే పాజిటివిటీ రేటు సున్నా శాతంగా ఉంది.

ఇక ఇప్పటి వరకూ కరోనాతో అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ మొత్తం 56 మంది కరోనాకు బలైపోయారు. ఇక టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 32525 మంది వైద్య, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందింది. ఇక ఇదే పరిస్థితి ప్రతి రాష్ట్రంలోనూ ఎప్పుడు వస్తుందో అప్పుడే అసలైన ఆనందం.. అప్పటి వరకూ కరోనా జాగ్రత్తలు తప్పని సరి అంటున్నారు  వైద్య నిపుణులు.

అంతే కాదు.. కరోనా సాధారణ మనుషుల కంటే.. అప్పటికే అనేక రోగాలతో బాధపడుతున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక రోగాల బారిన పడిన వారికి కరోనా వస్తే.. తట్టుకోవడం కష్టమని సూచిస్తున్నారు. అంటే.. ఇలాంటి వారి పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అందుకే అప్పుడే సంబరాలు చేసుకోవాల్సిన పని లేదు.. ఇంకా జాగ్రత్తలు తప్పనిసరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: