తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల్లోకి వెళ్ళే నాయకత్వం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా తెలంగాణ మీద దృష్టి పెట్టడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉండడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నల్గొండ వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు.

వాస్తవానికి ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కాస్త కాస్త బలం ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టకపోవడంతో పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో భవిష్యత్తులో ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపే అవకాశాలున్నాయని సమాచారం.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే తెలంగాణలో బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి ముందుకు వెళితే మంచి లాభం ఉంటుందనే భావన లో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి వంటివారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పార్టీ కోసం పని చేసే అవకాశం ఉంటుంది. అలాగే ములుగు జిల్లా కు చెందిన సీతక్క కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ అగ్ర నేతలు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: