ఏపి లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు రసాభాసగా సాగాయి.  అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు మరో కొద్ది రోజుల్లో జరగనున్న పుర పాలక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు లో పర్యటించారు. అక్కడ ఆయన అనుకున్న దానికన్నా కూడా బాబుకు అక్కడ ప్రజలు షాక్ ఇచ్చారు. టీడీపీ ఏం చేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బాబు తన మూడు రోజుల పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చేశారు.


కాగా, చిత్తూరు జిల్లా లోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బోణీ కాదని, ఆయన విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పుంగనూరు మండలం కురప్పల్లెలో జరిగిన మసెమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కరోనాకు భయపడి ఎక్కడా పర్యటించకుండా ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు.


 పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారని గుర్తు చేశారు. పర్యటనలో ఆయన మాట్లాడిన పదజాలం వింటే హాస్యాస్పదంగా ఉందన్నారు..చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మనుగడ లేదని చెప్పారు. ఆయన కుప్పంలో కాదుకదా జిల్లాలో ఎక్కడా గెలవలేడని జోస్యం చెప్పారు.. ఏదోక విషయం పై గొంతు చించుకోడం కాదు ప్రజల్లోకి వెళ్లి ఆయన ఏం సాధించారు, ఏం చేశారు అనే విషయాలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పుడే ప్రజల్లో అవగాహన కలుగుతుంది. కనీసం మున్సిపల్ ఎన్నికలు అయిన కొద్దో గొప్పో విజయాన్ని అందిస్తాయని హితవు పలికారు. అయితే బాబు మళ్లీ చిత్తూరు పర్యటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: