జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా న‌గ‌ర పాల‌క్ సంస్థ‌లు, కార్పొ రేష‌న్ల‌లో జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో దిగిన జ‌న‌సేన అభ్య‌ర్థుల్లో ఉత్తేజం నింపేందుకు.. పార్టీ అదినేత ప‌వ‌న్‌.. హైద‌రాబాద్లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఏపీ నుంచి కీల‌క నాయ‌కులు అక్క‌డ‌కు వెళ్లి.. చర్చించారు. పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టాల‌ని సూచిం చారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రికీ దిశానిర్దేశం చేశారు. తాను కూడా త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం వ‌చ్చి.. అక్క‌డ ప్ర‌చారానికి దిగుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌పైనా ల‌క్ష్యం నిర్ణ‌యించుకుని ముందుకు సాగుదామ‌ని ప‌వ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. దీనిని కూడా త‌ప్పుప‌ట్ట‌డానికి ఏమీ అవ‌కాశం లేదు. అయితే.. అనూహ్యంగా ప‌వ‌న్ నోటి నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుచోటు చేసుకున్నాయి. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే.. ప్రాచీన యుద్ధ విద్య‌లు నేర్పిస్తామ‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడి యాలో తెగ వైర‌ల్ కావ‌డంతోపాటు ట్రోల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌హారాష్ట్ర‌, హ‌రియాణాల నుంచి కొంద‌రు ప‌హిల్వాన్‌లు.. ప‌వ‌న్‌ను క‌లిశారు. ఈ నేప‌థ్యంలో వారిని స‌త్క‌రించిన ప‌వ‌న్‌.. ఈ సంద‌ర్భంగానే పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ప‌వ‌న్ చేసిన ప్రాచీన యుద్ధ విద్య‌లు నేర్పిస్తామ‌ని.. వ్యాఖ్యలు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్రాచీన యుద్ధ విద్య లు అంటే.. మ‌ల్ల‌యుద్ధాలు, క‌త్తిసాము, ఈటెలు, బ‌ల్లాలు విస‌ర‌డం.. గుర్ర‌పు స్వారీలు.. ముష్టి యుద్ధాలే.. క‌దా? అంటూ.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు ట్యాగ్ చేస్తూ.. నెటిజ‌న్లు జోక్ చేస్తున్నారు.

ఇన్నాళ్లు.. త‌మ‌ను ఏదో మున్ముందుకు.. మ‌రో ప‌దేళ్ల ముందుకు తీసుకువెళ్తాడ‌ని..ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకుంటే.. ఏకంగా ఆయ‌న బీసీ కాలం నాటికి తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ``ఇంకా న‌యం.. ఆదిమాన‌వుల వార‌సులు వ‌చ్చి ప‌వ‌న్‌ను క‌లిస్తే.. తాము అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రాన్ని ఆదిమాన‌వ యుగం చేస్తామ‌ని హామీ ఇవ్వ‌లేదు. ఓమైగాడ్‌..`` అని మ‌రికొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: