రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల వేడి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు వాడి వేడి వేడిగా సాగగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. అయితే హిందూపురం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు మాత్రం అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎందుకంటే మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు ఇంకా రెండు రోజులే ఉండటంతో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు సహా అందరిలోనూ టెన్షన్ నెలకొంది. దానికి ముఖ్య కారణం గత ఏడాది కౌన్సిల్ స్థానాల కోసం అధికార పార్టీ నామినేషన్ వేస్తున్న సమయంలో నవీన్ నిశ్చల్ వర్గీయులు అలాగే ఇక్బాల్ వర్గీయులు మొత్తం వైసీపీ తరఫున ఒక్క స్థానానికి 2 నామినేషన్లు దాఖలు చేశారు. 

అయితే అప్పట్లో ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన నేత ఇద్దరికీ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వీరిద్దరూ ఒప్పుకోలేదు. అయితే తదనంతర పరిస్థితులలో ఎన్నికలు వాయిదా పడటం ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచే ప్రక్రియ మొదలు కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా నవీన్ నిశ్చల్, ఇక్బాల్  ఇద్దరూ కూడా తమ తమ వర్గీయులను వెనక్కి తగ్గమని చెప్పేందుకు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమ వర్గానికి చెందిన వారికే పార్టీ బీఫామ్ ఇవ్వాలంటూ ఇద్దరు భీష్మించుకుని కూర్చోవడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ గా యబ్బ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిన్న హిందూపూర్ చేరుకుని ఎమ్మెల్సీ ఇక్బాల్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన నవీన్ నిశ్చల్ వద్దకు వెళ్లి ఆయనతో కూడా మాట్లాడారు. నిజానికి నవీన్ తనకు సంబంధించిన 18 మంది అనుచరుల లిస్ట్ ఇన్ ఛార్జ్ కు అందజేశారు. లిస్ట్ తీసుకుని ఇక్బాల్ వద్దకు వెళ్లిన విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి సమావేశమయ్యారు. ఇక్బాల్ కూడా ఒక లిస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ రెండు లిస్టులను మధించి చివరిగా విశ్వేశ్వరరెడ్డి ఒక తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒక పక్క బాలయ్య కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: