ఆధిప‌త్యానికి పెట్టింది పేరైన బ్రిటీష‌ర్ల‌నే పార‌దోలిన మ‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని గ‌ద్దె దింప‌డం క‌ఠిన‌మైన విష‌యంకాద‌ని రాహుల్ గాంధీ  అన్నారు. దేశంలోని న‌గ‌దుపై ఆధిప‌త్యం చెలాయిస్తున్న‌, ప్ర‌త్య‌ర్థుల‌ను న‌లిపేస్తున్న బ‌ల‌మైన శ‌త్రువుతో పోరాడుతున్న‌ట్లు మోడీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఆయ‌న కంటేచాలా పెద్ద శ‌త్రువులైన ఆంగ్లేయుల‌ను ఎప్పుడో వెన‌క్కి పంపించామ‌న్నారు. మోడీని త్వ‌ర‌లోనే ఆర్ ఎస్ ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న నాగ‌పూర్‌కు పంపించ‌డం ఖాయ‌మ‌న్నారు.

ప్రధాని నరేంద్రమోదీ తమకు బలమైన శత్రువు అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆయనను ప్రజల మద్దతుతో అహింసాయుత పద్ధతిలోనే ఓడిస్తామని ప్రకటించారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ తిరునల్వేలి జిల్లా పాళయంకోట జేవియర్‌ కాలేజీలో విద్యావేత్తలతో సమావేశమయ్యారు. బ్రిటిష్‌ పాలకుల కన్నా మోదీ బలమైన శత్రువు కాదని, అలాంటి బ్రిటిషర్లనే భారత ప్రజలు దేశం నుంచి తరిమికొట్టారని అన్నారు. అలాగే మోదీని కూడా నాగ్‌పూర్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రధాన కార్యాలయం)కు తరిమికొడతామన్నారు. ఓటమి తరువాత మోదీ రాజకీయంగా కనుమరుగవుతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వకు ప్రతినిధిగా చెప్పుకొంటుందని, కానీ.. ఆచరణలో మాత్రం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఇక మోదీ సర్కారు తెచ్చిన నూతన విద్యావిధానం.. పూర్తి అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకునేలా, దేశంలో విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని రాహుల్‌ ఆరోపించారు. విద్యను మతపరంగా మార్చేందుకు, భారత సమాజంపై ప్రత్యేక భావజాలాన్ని రుద్దేందుకు ఇచ్చిన ఆయుధంగా నూతన విద్యావిధానాన్ని అభివర్ణించారు. ఉప్పుమడి కార్మికులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు

తిరునల్వేలిలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్గమధ్యంలో కొబ్బరి బొండాల వ్యాపారితో ముచ్చటిం చారు.  అలంకుళంకు వెళుతూ మార్గమధ్యంలో రాహుల్‌గాంధీ కారు ఆపి రోడ్డు పక్కనే ఉన్న వ్యాపారి వద్దకు వెళ్లి కొబ్బరి బొండాలు కొట్టించుకొని తాగుతూ అతనితో ముచ్చటించారు. తనతో పాటు నేతలు కూడా కొబ్బరి నీరు తాగడంతో, వ్యాపారికి రాహుల్‌ నగదు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: