చ‌మురు సంస్థ‌లు సామాన్య జ‌నానికి ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతుండ‌టంతో సామాన్యులు విల‌విల‌లాడిపోతున్నారు. గ‌త 20రోజుల్లో కేవ‌లం రోజు పెరుగుతున్న ద‌శ‌లో పెరిగి నాలుగు రోజులు మాత్రం రూపాయి త‌గ్గింది. అయితే మ‌రుస‌టి రోజే పెరుగుద‌ల ఉండ‌టం విశేషం. ఎక్కువ పెరిగి త‌క్కువ త‌గ్గుతుండ‌టంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. మొత్తంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలు ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  సోమ‌వారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 94.79 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 88. 86 కు లభిస్తోంది.  దీంతో ప‌రోక్షంగా నిత్యావసర సరుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు పెట్రోల్ ధ‌ర‌లు కార‌ణ‌మ‌వుతున్నాయి. నుంచి పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం ధరలు ఆకాశాన్నంటాయి.


దేశ రాజధాని ఢిల్లీ సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 గా ఉంది. డీజిల్ ధర రూ. 81.47 గాఉంది. అలాగే ముంబైలో పెట్రోల్ రూ. 97.57, డీజిల్ రూ. 88.60 గా ఉంది. పుణెలో పెట్రోల్ రూ. 97.37 ఉండగా, డీజిల్ 87.06 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11 గా ఉంది. డీజిల్ రూ. 86.45గా ఉంది. కలకత్తాలో లీటర్ పెట్రోల్ రూ. 91.35 లకు లభిస్తుండగా, డీజిల్ రూ. 84.35 లకు లభిస్తోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.2 , డీజిల్ 90.72గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ రూ. 96.27. డీజిల్రూ . 89.82. ఇక కృష్ణా జిల్లాలో పెట్రోల్ ధర రూ. 97.21 గా ఉండగా, డీజిల్ ధర రూ. 90.67 ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 97.13గా ఉండగా, డీజిల్ రూ. 90.72 లభిస్తోంది.


ఇదిలా ఉండ‌గా ప‌ట్ట‌ణాల్లోని ఆటో, క్యాబ్‌వాలాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆటో, క్యాబ్‌లవైపు  ప్రయాణికులు ఆకర్షితులవుతున్న దశలో ఇంధన ధరలు పెరగడం  వారికి శాపంగా మారింది. రోజువారీ ఆదాయంలో ఎక్కువ మొత్తం డీజిల్‌ ఖర్చులకే పోతున్నాయని బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.. ఫుడ్‌ డెలివరీ కంపెనీల నుంచి ఆన్‌లైన్‌ హోల్‌సెల్‌, రిటైల్‌ కంపెనీల్లో డెలివరీ బాయ్‌గా చేరి రోజువారీ భత్యం పొందేవారి జేబులను పెరిగిన పెట్రోల్‌ ధరలు గుల్ల చేస్తున్నాయి. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లదీ ఇదే పరిస్థితి.  ర‌వాణాతో సంబంధం ఉన్న ప్ర‌తీ రంగానికి పెట్రోల్ ధ‌ర‌ల సెగ త‌గులుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: