బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బహిరంగ లేఖ రాసారు తెరాస పార్టీ ఎమ్మెల్యేలు. దళితులంటే చెప్పులు కుట్టుకునేవారిగా, మొలలు కొట్టుకునేవారిగా వ్యాఖ్యలు చేసారు బండి సంజయ్ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. నడిమంత్రపు సిరివస్తే.. కన్నూమిన్నూ గానకుండా విర్రవీగినట్టు ప్రవర్తిస్తున్నాడు రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని మండిపడ్డారు.  నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సాటి మనుషులనే అవమానిస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే తలాతోకలేని మాటలు మాట్లాడే వ్యక్తిగా సమాజంలో ముద్రపడ్డ బండి సంజయ్.. మరోసారి దళితుల పట్ల అమానుషపు వ్యాఖ్యలు చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బండి సంజయ్ కు దళితులంటే చెప్పులు కుట్టుకునే వారుగా, మొలలు కొట్టుకునే వారుగా కనపడుతున్నారు అని అసహనం వ్యక్తం చేసారు., ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ , గాదరి కిశోర్, కాలె యాదయ్య , ఆరూరి రమేష్, క్రాంతి కిరణ్ చిరుమర్తి లింగయ్య, సుంకె రవిశంకర్  దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఈ లేఖ రాసారు.  తన బీజేపీ పార్టీ ఆలోచన విధానాలకు ఇది అద్దం పడుతోంది అని మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ విధానాలు బూజు పట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణిచివేతకు అద్దం పట్టేవి అని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి రుజువు చేసాడు అని మండిపడ్డారు.  

దళితులకు చెప్పులు కుట్టడమే కాదు, మొలలు కొట్టడం కూడా వచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఈ ఆధునికయుగంలో కూడా  దళితుల స్థితిగతులు ఇంకా అలాగే ఉండాలని సంజయ్ కోరుకుంటున్నట్లు సుస్పష్టమవుతున్నది అని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళితులు ఇంకా చెప్పులు కుట్టుకొనే బతకాలని కోరుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. తరతరాలుగా అంటరానితనానికి అణిచివేతకు గురై విద్యకు దూరమైన దళితులకు..  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వారికి హక్కులు కల్పించి.. విద్య, ఉద్యాగాలలో అవకాశాలు దక్కేలా చూశారు అని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశాలతో.. దళితులు అన్ని రంగాలలో అందరితో పోటీ పడి.. ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే..  బండి సంజయ్ కి మింగుడుపడటంలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: