వికారాబాద్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.  సురభీదేవి అభ్యర్థి ప్రకటనతో నే మనగెలుపు ఖాయమైపోయింది అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులే పోటీ...చిన్నాచితక పార్టీలు మనకు పోటీ కావు అని ఆయన స్పష్టం చేసారు. వికారాబాద్ లో బీజేపీ వాళ్లు ఎక్కతక్క మాట్లాడితే బిజేపి అధికారంలో ఉన్న కర్నాటక చించోళి చౌరస్తాలో చర్చపెట్టాలే అని సవాల్ చేసారు. తెలంగాణ పథకాలు కేంద్ర మంత్రులు బాగున్నయంటే...గల్లీ లీడర్లు భాగలేవంటరు అని మండిపడ్డారు.

కేవలం గోబెల్స్ ప్రచారం...బోగస్ ప్రచారం చేసి లబ్ధిపోందాలని చూస్తున్నారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా...ఉన్న ఉద్యోగాలు పీకెస్తుంది అని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లు తీసేయాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నించే గొంతుకు అంటుంటారు...ఎవరిని ప్రశ్నిస్తారు గ్యాస్, పెట్రోల్,డిజీల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని డిమాండ్ చేసారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా..చూపించి మాట్లాడాలే అని సవాల్ చేసారు.

పార్టీ కన్నతల్లి లాంటిది... నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తల్లికి ద్రోహం చేసినట్లే అని మండిపడ్డారు. ఎంతో మంది గ్లాడియేటర్లను తయారు చేసిన ఘనత మన అభ్యర్థి వాణీదేవిది...ఆమె దేశ ప్రధాని కూతురైన సాధాసిదా జీవితం గడిపింది అని అన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పడడానికి కారణం కేసీఆర్ అని ఆయన అన్నారు. ఒకటో...రెండో సిట్లు ఓడిపోతే ఏదేదో మాట్లాడుతుండ్రు..పనైపోయింది అంటుండ్రు...మా పనైపోలే అని ఉగాది తర్వాత సొంత జాగలో ఇళ్లు కొట్టుకునే కార్యక్రమం ప్రారంభిస్తాం అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడే ఏమి చేయలే...గిప్పుడేమి చేస్తారు అని నిలదీశారు. ప్రతి 50 ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించాం...మీరంతా ప్రతి ప్రతి ఓటర్ ను కలవాలే అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: