తెలంగాణలో భారతీయ జనతాపార్టీ బలపడితే ముఖ్యంగా ఇబ్బంది పడేది కాంగ్రెస్ పార్టీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు కాబట్టి సీఎం కేసీఆర్ కి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న సరే రాష్ట్రస్థాయిలో బలంగా లేని కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీ అధిష్టానంపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జగ్గారెడ్డి అలాగే నల్గొండ జిల్లా నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా కొంతమంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వీళ్లందరి తో కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనేతల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కేంద్ర పెద్దల హామీతోనే పార్టీ మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో ఎవరు వెళ్తారు ఏంటి అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగానే ఉంది. మరి మొత్తం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: