జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఎంతో మంది సామాన్య ప్రజలు రేషన్ సరుకులు పొందుతున్నారు అనే విషయం తెలిసిందే.  అయితే ఎంతో మంది సామాన్య ప్రజలు ఈ రేషన్ సరుకుల ద్వారానే జీవనం గడుపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కేవలం ఒక్క రూపాయికే కిలో బియ్యం అందిస్తూ ఉండడం.. ఇక మిగతా సరుకులు కూడా అతి తక్కువ ధరకే అందిస్తూ ఉండటంతో...  ప్రస్తుతం ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలు ఈ రేషన్ ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో రేషన్ సరుకులు పొందుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. అయితే ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ సరుకులు అందించేందుకు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది అన్న విషయం తెలిసిందే . ఇక రోజు రోజుకు రేషన్ కార్డు దారుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇక కేంద్ర ప్రభుత్వం పై రోజురోజుకు రేషన్ సరుకుల కు సంబంధించిన భారం పెరిగి పోతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది అన్నది అర్థమవుతుంది.



 జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశంలో రేషన్ సరుకులు పొందుతున్న వారి సంఖ్యను తగ్గించాలని నీతి అయోగ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఆహార రాయితీలకు దాదాపుగా 4.22 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న  నేపథ్యంలో రోజురోజుకు ఈ భారం పెరిగిపోతుందని.. అందుకే ఈ భారాన్ని తగ్గించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది నీతి అయోగ్. ప్రస్తుతం గ్రామాల్లో 75 శాతం మంది రేషన్ తీసుకుంటూ ఉండగా దీనిని 60శాతానికి ఇక  పట్టణాల్లో 50 శాతం రేషన్ సరుకులు తీసుకుంటూ ఉండగా దానిని 40 శాతానికి తగ్గించాలని సిఫారసు చేసింది. ఇలా చేయడం వల్ల 47299 కోట్లు ఆదా అవుతుంది అంటూ తెలిపింది.  దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: