ఏపీలో ఇపుడు మునిసిపల్ పోరు సాగుతోంది. పట్టణ వాసులు తమ అభిప్రాయాలను ఓట్ల రూపంలో తీర్పుగా వెలువరించనున్నారు. ఏపీలో దాదాపుగా రెండేళ్ళకు దగ్గర పడుతున్న వైసీపీ సర్కార్ మీద జనాలు ఏమనుకుంటున్నారు అన్నది అత్యంత ఆసక్తికరం. అటు అధికార తెలుగుదేశం, ఇటు ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు కూడా ఢీ అంటే ఢీ కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ నెల 10న జరిగే పురపాలక సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను ఎన్నిక సంఘం  చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం ఓటర్లు 91 లక్షల, 17 వేల 511 మంది ఉన్నారు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు చూస్తే 9,308 ఉన్నాయి. ఇక ఎన్నికల విధుల కోసం 55,840 మందిని నియమించారు.

ఇదిలా ఉంటే  ఈ పోలింగ్ కేంద్రాల్లో అత్యధికంగా  విశాఖ జిల్లాలో 1,818 పోలింగ్ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 111 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.  ఇక ఓటర్ల జాబితా చూస్తే 18 లక్షల 36 వేల 224 మంది ఓటర్లు ఒక్క విశాఖలోనే ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో అయిదవ వంతు అన్న మాట. ఆ విధంగా ఆలోచిస్తే విశాఖ ఫలితం ఏపీ రాజకీయాల మీద బాగా ప్రభావం చూపిస్తుంది అని అర్ధమవుతోంది.

విశాఖ తరువాత ఎక్కువ మంది ఓటర్లు ఎక్కడ ఉన్నారు అంటే కర్నూలులో 10 లక్షల 85 వేల 758 మందిగా చెబుతున్నారు. అలాగే, గుంటూరు లో 10 లక్షల 77 వేల 617 మంది ఉన్నారు. అంటే ఏపీలో విశాఖ కంటే పెద్ద కార్పోరేషన్ లేదు. దీనికి కనుక గెలుచుకుంటే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినట్లే. అందుకే అటు అధికార పార్టీ, ఇటు విపక్షాలు కూడా విశాఖ మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: