దేశంలో బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. బంగారం కోనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఖ‌చ్చితంగా శుభ‌వార్త‌నే చెప్పాలి. గ‌త మూడురోజులుగా పసిడి ధరలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  దేశీయ మార్కెట్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్లో ప్రొత్సాహాకాలు ప్ర‌క‌టించ‌డంతో మ‌దుప‌ర్లు ఇత‌ర రంగాల వైపు మ‌ళ్లారు. దీంతో బంగారంపై ఇన్వెస్ట‌ర్లు త‌గ్గిపోవ‌డంతో త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగా విశ్లేష‌ణ జ‌రుగుతోంది.


మొత్తంగా సామాన్యుడికి అంద‌నంత దూరం వెళ్లిపోయిన పసిడి ధ‌ర‌లు ఎట్ట‌కేల‌కు దిగివ‌స్తున్నాయి.  అయితే అంతర్జాతీయంగా కూడా ధరలు తగ్గడంతో దేశీయంగా ధ‌ర‌లు ఇంకా మున్ముందు కూడా ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా కేంద్రం బడ్జెట్ లో ప్రోత్సాహకాలు ప్రకటించండంతో ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.42,690 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 తగ్గి రూ.456,570 కి చేరింది.  వెండిసైతం బంగారం బాటలోనే పయనించింది.  


కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.72,500కి చేరింది. బంగారం ధరలు తగ్గడంతో మహిళలు బంగారం కొనుగోలుపై దృష్టిసారించారు.  విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.43,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,750 దగ్గరగా కొనసాగుతుంది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.43,720 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,710 దగ్గర కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: