కరోనా ప్రభావం మళ్లీ సెకండ్ వేవ్ ఊపందుకుంది.. దాదాపు ఏడాది వరకు ప్రజలను వణికించింది . అయిన కరోనా దాహం తీరలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అంతకు మించి అంటూ ముంచుకొస్తుంది. ఒకవైపు కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కరోనా భయంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించేందుకు సిద్ధపడ్డారు.. మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర పాజిటివ్ కేసుల లో ముందంజలో ఉంది. తమిళనాడులో కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు అదే బాట పట్టింది. కరోనా సంబంధింత పరిమితులను మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, దుకాణాలు, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు కొన్ని గంటల పాటు మాత్రమే పనిచేయనున్నాయి. అదేవిధంగా కోవిడ్‌ నిబంధలను ఉల్లంఘనలను అరికట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ముఖ్యంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు..


బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌తో పాటు భౌతిక దూరం తప్పక పాటించాల్సిందే. అత్యవసర సేవలు మినహాయించి అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించారు. 65 ఏళ్లకు పైబడిన వారితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నా వారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు చిన్నారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గడిచిన 24 గంటల్లో 486 కొత్త కేసులతో పాటు ఐదుగురు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా కేసులు పెరగడం, మరణలా సంఖ్యలో రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గవచ్చునని అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి కొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను ప్రకటించాలని అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు, కరోనా ను ఎదుర్కోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: