మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో టీడీపీ నేతలు కొత్త పథకాలను రచిస్తున్నారు. పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు సొంత జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న చిత్తూరు జిల్లా లో పర్యటించిన ఆయనకు ప్రజలు షాక్ ఇచ్చారు.. టీడీపీ పార్టీని గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు.. కానీ ఎప్పుడైనా ప్రజల బాగోగులను పట్టించుకున్నారా అని ప్రశ్నలు గుప్పించారు దీంతో ఆయన పర్యటన మధ్య లోనే వెళ్ళి పోయారు.  ఈ విషయం పై ప్రజలు రక రకాలుగా అనుకున్నారు.ఇప్పుడు మళ్లీ బాబు చిత్తూరు జిల్లాలో పర్యటించడానికి బయలు దేరారు. తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.


కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు ఉండిపోయారు.అక్కడే నేలపై బైఠాయించి ఆయన నిరసనకు దిగారు. మరోవైపు తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని అందులో పేర్కొన్నారు.


చంద్ర బాబు చేపట్టిన చిత్తూరు పర్యటన మధ్యలోనే ఆగిపోయెలా ఉందని తెలుస్తోంది. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.ఇలా టీడీపీ నేతల పై పోలీసులు అధికారం చెలాయించడం తో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కడ గెలుస్తామో అన్న భయంతో వైసీపీ  నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు. టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: