అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపాలిటీలలో తాడిపత్రి కూడా ఒకటి. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు గాను అటు అధికార వైసీపీ సహా ప్రతిపక్ష టీడీపీ కూడా అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన తన కొడుకు చేత నామినేషన్ వేయించి తాను చైర్మన్ రేసులో ఉన్నామని సంకేతాలు పంపారు. మరో పక్క టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేస్తూ ఉండడం తో ఉత్కంఠ నెలకొంది. అందుకే ముఖ్య నేతలు రంగంలోకి దిగి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన వారు తమకు అనుకూలంగా నామినేషన్లు వెనక్కి తీసుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను ఇప్పటికే 208 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అన్ని పార్టీల కంటే అధికార వైసీపీ రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. అందుకే అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు రంగంలోకి దిగి నామినేషన్స్ ఉపసంహరింప చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి అధికార పార్టీకి సంబంధించిన రమేష్ రెడ్డి అనే నాయకుడు తన అనుచర వర్గం చేత దాదాపుగా చాలా వార్డుల్లో నామినేషన్లు చేయించారు.

ఈ క్రమంలో హలో రమేష్ రెడ్డితో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించినట్టు అని చెబుతున్నారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా రమేష్ రెడ్డి వర్గానికి చెందిన వారు అందరూ నామినేషన్ల వెనక్కి తీసుకుంటారని చెబుతున్నారు. అయితే నిజానికి పదో వార్డులో తెలుగుదేశం తరఫున నామినేషన్ వేసిన వ్యక్తి అలాగే 15 వార్డులో వైసీపీ తరఫున నామినేషన్ మరో వ్యక్తి వివిధ కారణాలతో మరణించారు. అయితే ఎన్నికల సంఘం ఈ వార్డుల్లో ఇరు పార్టీలకు నామినేషన్ సమర్పించేందుకు అవకాశాలు ఇచ్చినా ఈ రెండు పార్టీల తరఫున నామినేషన్ వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: