టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నాకు ఎందుకు నోటీసులు ఇచ్చారో ముందు చెప్పాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. నిరసన కార్యక్రమానికి వెళుతుంటే ఆపుతారా? అని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్‌ను, ఎస్పీని రమ్మనమనండి అని ఆయన డిమాండ్ చేసారు. తిరుపతికి రోజూ 55వేల మంది వస్తున్నారు. నన్ను ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు.

ఎస్పీని పిలిపిస్తామని చంద్రబాబుకు నచ్చచెప్పబోయిన పోలీసులపై ఒక్కసారిగా పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్ట్‌ చేస్తారా...? చేయండి..? కొడతారా...కొట్టండి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను ప్రెస్‌ను అడ్రెస్‌ చేయాలి అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా, ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్నా అని, నాకు ప్రాధమిక హక్కులు లేవా?... ఈ దేశంలో ఏమైంది..? అని ఆయన ప్రశ్నించారు. నన్ను ఎందుకు నిర్భందించారు...నేను ఎస్పీ దగ్గరకు వెళ్లి అనుమతి ఇవ్వమని కోరుతా అన్నారు చంద్రబాబు. పోలీసులతో రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు గొడవ పడ్డారు.

మేము ఎస్పీని పిలపిస్తామని నచ్చచెప్పబోయిన పోలీసుల మాట చంద్రబాబు వినలేదు. ఇక ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు టీడీపీ నేతలను తక్షణమే విడిచిపెట్టాలి అని కోరారు. ప్రజాస్వామ్యంలో  ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా.?  అని నిలదీసారు. వేలాది మందితో కుల సంఘాల మీటింగులు, ర్యాలీలు, సభలు, పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?  అని ఆయన ప్రశ్నించారు.     ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వటం లేదు అని అన్నారు. చంద్రబాబు పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: