టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వచ్చే విషయంలో ఆసక్తి చూపించడం లేదు. పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చాలా మంది అగ్ర నేతలు భావిస్తున్నారు. ఇక రాయలసీమ జిల్లాల్లో ఉన్న కొంతమంది నేతలు అయితే కర్ణాటకలో ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ అక్కడ ఎక్కువగా తిరుగుతున్నారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఓడిపోయిన నియోజకవర్గాలతో పాటు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా ఇన్చార్జిలను మార్చే అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిని మార్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.

తన సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే బెందాళం అశోక్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఇన్చార్జిని నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం సంబంధించి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్చార్జి వేటలో ఉన్నారు అని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో ముందుగానే జాగ్రత్త పడుతున్నారట చంద్రబాబు నాయుడు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారి విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సీనియర్ నేత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్చార్జి మార్చే ఆలోచనలో ఆయన ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: