ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వివిధ పార్టీల నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మొక్కుబడి మీటింగ్ పెట్టినట్టు అర్ధమవుతుంది అని ఆయన మండిపడ్డారు. సమస్యలు చెప్పండి పరిష్కరిస్తామని పిలిచి 5 నిముషాలు సమయం ఇస్తారా? అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షానికి 5 నిముషాలు టైం ఇస్తారా అని ప్రశ్నించారు. నాలుగు పంచాయతీ ఎన్నికల లో జరిగిన అవకతవకలు గురించి చెప్పొద్దా అని ప్రశ్నించారు.

బల్ డిజిట్ లో గెలుపు ఉంటే రీకౌంటింగ్ వద్దన్నారు ఎందుకు చేశారు అని ఆడిగాం అని అన్నారు. పంచాయతి ఎన్నికల ముందు ఉన్న నిమ్మగడ్డ వేరు ఇప్పుడు ఉన్న వారు వేరు అని అన్నారు. కౌంటింగ్ సెంటర్ లకు వచ్చి పోలీస్ లు విజయాపజయాలు నిర్దారిస్తున్నారు అని ఆరోపించారు. ఎస్ ఈ సి ఇలా ఉంటే న్యాయం జరుగుతుంది అని నేను భావించడం లేదు అని, నిమ్మగడ్డ భయపడ్డారు అని నేను అనడం లేదు ఆయనలో మార్పు వచ్చింది అంటున్నాను అని స్పష్టం చేసారు. ఎన్నికల కమిషనర్ మా మాట వినడానికి పిలవలేదు  అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీటింగ్ నిర్వహించిన తీరు పట్ల నిరసన తెలియజేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియ ఎక్కడి ఆగిందో అక్కడ ప్రారంభించడం తో ఎస్ ఈ సి ప్రభుత్వానికి తలొగ్గారు అని మండిపడ్డారు. జిల్లాల్లో ఆర్ ఓ లు ఎక్కడ పనిచేయడం లేదు. అధికార పార్టీ కి అనుకూలంగా వ్యవహరించారు అని ఆయన ఆరోపించారు. సీపీఐ సీనియర్ నాయకులు  జల్లి విల్సన్ మాట్లాడుతూ డివిజన్ లో ఓట్ లు విభజన సరిగా జరగలేదు అని మండిపడ్డారు. 5 తారికు లోపు స్లిప్ లు ఓటర్ లకు అందించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: