ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు కొంతమంది పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి జగన్ గాని ఎంపీలు గానీ పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం  లేదు. అయితే ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్ పార్లమెంట్ సమావేశాల్లో ఏవిధంగా మాట్లాడాలి ఏంటనే దానిపై అనేక సూచనలు చేసినా సరే వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో జగన్ ఇప్పుడు అసహనంగా ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

కనీసం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ లో మాట్లాడటం లేదు. అలాగే లోక్ సభ  పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మిధున్ రెడ్డి  కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో అనేక ఇబ్బందులు వైసీపీ ఎదుర్కొంటుందని చెప్పాలి. రాయలసీమ జిల్లాలకు చెందిన ఎంపీలు అయితే పార్లమెంట్ సమావేశాల్లో కూడా దూరంగానే ఉంటున్నారు. కర్ణాటకకు చెందిన కొంతమంది బిజెపి ఎంపీ లతో రాయలసీమ ఎంపీలకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.

దీంతో వారితో సన్నిహితంగా ఉంటున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీని పట్ల ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఎంపీలు ఉండగానే పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త నేతను ఇన్చార్జిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దాదాపుగా ఆరు స్థానాలకు సంబంధించి ఇన్చార్జిలను ప్రకటించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని సమాచారం. ఈ మేరకు నేతల పేర్లను కూడా ఆయన ఖరారు చేశారని వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: