దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దూకుడుగా ఉన్నారనే ప్రచారం భారతీయ జనతా పార్టీ నేతలు ఎంత వరకు చేసినా సరే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి అనే మాట వాస్తవం. రాజకీయంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా పార్టీ నేతలు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నారు. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా వెనుకబడి ఉంది అనే మాట వాస్తవం.

రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే ప్రజల్లోకి వెళ్లే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చరిత్రలో లేనివిధంగా ఆ పార్టీ ఎక్కువ మెజారిటీ సాధించింది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీలు చాలామంది ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఆసక్తి చూపించడం లేదని కేంద్ర మంత్రులు కూడా ప్రజలకు దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందనే భావనలో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది అగ్ర నేతలు కూడా పార్టీకి దూరంగా ఉండటంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో నష్టనివారణ చర్యలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం దిగే అవకాశం ఉందని సమాచారం. భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరైతే ప్రజల్లోకి వెళ్లడం లేదో వాళ్ళందరూ మీద కూడా ప్రధానమంత్రి మోడీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: