ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా ఉన్నా సరే కొన్ని శక్తులు ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్యమంత్రి జగన్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. జగన్ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతలు కొంతమంది గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి రాజ్యసభ ఎంపీలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ మీద కాస్త గట్టిగా దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

త్వరలోనే బీజేపీకి చెందిన కొంతమంది అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడే విషయంలో వెనకడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే విషయంలో కొంతమంది నేతల సహకారం తీసుకునే ఆలోచనలో బిజెపి అగ్రనేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటంతో ఆ పార్టీ సీనియర్ నేతలను భారతీయ జనతా పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే వైసిపి లో ఉన్న కొంత మంది మంత్రుల మీద కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది మంత్రులు జగన్ కు సహకరించడం లేదు అనే విషయాన్ని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురు నేతలు మీద ఎక్కువగా బిజెపి నేతలు దృష్టి పెట్టారు. మరి వాళ్ళు పార్టీ మారతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. గాని వాళ్లు పార్టీ మారితే మాత్రం తాము ఏ విధంగా న్యాయం చేస్తామో బీజేపీ నేతలు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: