దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది అనే విషయం తెలిసిందే . మొదట ఆరోగ్య కార్యకర్తలకు వాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ క్లిష్ట  పరిస్థితుల్లో కూడా ముందుండి పోరాడిన ఆరోగ్య కార్యకర్తలకు పారిశుద్ధ్య కార్మికులకు పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్న  విషయం తెలిసిందే .  ఇక ఈ వ్యాక్సిన్  ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకున్న వారు అందరూ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన యాప్ కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.




 ఇకపోతే ఇటీవలే దేశంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. దేశీయంగా తయారైన కోవాక్జిన్  వ్యాక్సిన్ మొదటి డోస్  దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించాలి అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంతో మంది ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కరోనా  వారియర్స్ అయిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించిన  విషయం తెలిసిందే.  ఇప్పుడు వృద్ధులకు వ్యాక్సిన్  అందించి అందరిలో యాంటీ బాడీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 60 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్  అందించేందుకు నిర్ణయించారు...



 అయితే 60 సంవత్సరాలకు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై స్పందించిన  కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గె  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వ్యాక్సిన్  తీసుకోబోను  అంటూ కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు తన వయసు 70 ఏళ్లు అని.. మహా  అయితే మరో పది పదిహేనేల్లు  బతుకుతానని.. అందుకే తాను వ్యాక్సిన్ తీసుకోబోనని వ్యాక్సిన్ ముసలి వాళ్లకి కాదు యువతకు ఎంతో అవసరం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముసలి వాళ్లకి కాకుండా యువతకి వ్యాక్సిన్  ఇస్తే వాళ్ళు ఎక్కువ రోజులు జీవించేందుకు అవకాశం ఉంటుంది అంటూతెలిపాడు మల్లికార్జున ఖర్గె. ఈ విషయంపై కేంద్రం ఆలోచించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: