తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేస్తుంది. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తలసాని ని దున్నపోతు తో పోల్చిన రేవంత్ రెడ్డి .. ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం చర్చకు వస్తే తప్పేముంది... అని నిలదీశారు. చర్చకు రాకుండా తలసాని లాంటి దున్నపోతులను దాసోజు శ్రవణ్ పై ఉసగొల్పడం ఏంటి  అని నిలదీశారు.

శ్రవణ్ వెనక ఎవరు లేరని కొంత మంది దున్నపోతులు విర్రవీగితే ఊరుకునేది లేదు అని ఆయన హెచ్చరించారు. దాసోజుపై తలసాని ఇష్టానుసారం మాట్లాడితే ఈపులు విమానం మోత మోగుతాయి .. జాగ్రత్త అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ సమాధానం చెప్పలేక పారిపోయి... అచ్చోసు ఆంబోతులను శ్రవణ్ పై వదిలాడు అని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్సీ క్యాండెట్ లు విద్యాసంస్థల యజమానులు అని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే..ఉస్మానియా , కాకతీయ యూనివర్సిటీ లను కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారు అని మండిపడ్డారు.

టిఆర్ఎస్ ఓడిపోతుందనే హరీష్ కు ఇంఛార్జ్ ఇచ్చారు అని అన్నారు. ఎన్నికల ముందు ఈటెల ,ఎన్నికల తర్వాత హరీష్ పని అయిపోతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నియామాకాల విషయం లో ప్రభుత్వం నుంచి  చర్చకు ఎవరు  ఎక్కడికి వచ్చినా మేము చర్చ కు  సిద్దం అని ఆయన సవాల్ చేసారు. ఇక ఇదిలా ఉంటే గాంధీభవన్ లో అనుబంధ సంఘాల నాయకులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వెంకట్, వంశీ చంద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: