తెలంగాణాలో ఇప్పుడు దళితుల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా బిజెపి నేత మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ లో దళిత ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదన్న మోత్కుపల్లి... కేటీఆర్ రాయించిన లేఖలో టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టకపోవటమే ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని మోత్కుపల్లి ఆరోపించారు. దళితులకు ప్రేమించే పార్టీలు మాత్రమే అధికారంలో ఉంటాయి అని ఆయన అన్నారు.

దళితులు ఏకమైతేనే తెలంగాణలో దోపిడీ రాజ్యం పోతోంది  అని ఆయన స్పష్టం చేసారు.  అహంకారంతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చెప్పుతో సమానం అన్నాడు అని ఆయన ఆరోపించారు. ఓట్లేసిన ప్రజలను చెప్పులతో పోల్చిన కేసీఆర్ కు చెప్పుల దండలు తప్పవు అని హెచ్చరించారు. బండి సంజయ్ ని విమర్శించే అర్హత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదు అని స్పష్టం చేసారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి.. టీఅర్ఎస్ దళిత ఎమ్మెల్యేలకు నోరు విప్పే దమ్ము లేదు అని ఆయన ఎద్దేవా చేసారు. ఒక బీసీ నాయకుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం గర్వకారణమని అన్నారు.

పైరవీలు చేసుకునే ధర్మారెడ్డి దళితులను అవమాన పరిచాడు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అండతోనే బ్రోకర్  ధర్మారెడ్డి రెచ్చిపోతున్నాడు అని మండిపడ్డారు. క్యాబినెట్లోకి దళితులను తీసుకొని ముఖ్యమంత్రి పై కేసు పెట్టాలి అని డిమాండ్ చేసారు. దళిత ఎమ్మెల్యే లు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు అని ఆయన సూచించారు. బండి సంజయ్ పేరు వింటేనే కేసీఆర్ భయపడుతున్నాడు. టీఆర్ఎస్ ని గద్దె దించే దమ్ము బీజేపీ మాత్రమే ఉంది అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ చనిపోతే ఒక్క దళితుడు కూడా ఆయన్ను గౌరవించడు అన్నారు. బండి సంజయ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు. మొలలు చెప్పులకే కాదు కేసీఆర్ రాజకీయ జీవితంపై కూడా దించుతాం అని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: