టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా రేణిగుంట విమానాశ్రయంలో ధర్నా చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ వ్యవహారంపై స్పందించారు. కుప్పం పర్యటన లో ప్రజలు పెద ఎత్తున నీరాజనం పలికారు అని అన్నారు. చంద్రబాబు చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్త  ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని చంద్రబాబు నేల మీద కూర్చునే పరిస్థితి వైసిపి తీసుకొచ్చింది అని ఆయన ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి ది  పిరికిపంద చర్య  అని అన్నారు. టీ కోట్టు నడుపుకునే వ్యక్తి కార్పొరేటర్ గా పోటీ చేయడాన్ని తట్టుకోలేని వైసీపీకి నాయకులు అతని టీ కొట్టు ను పడేయడం దారుణం అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ భర్త, కర్మ అయితే ఆమెను భర్త సమాధి వద్దకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్  చేశారు అని ఆరోపణలు చేసారు. పంచాయతీ ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలకు ఏ విధంగా పాల్పడ్డారో,మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా దాడులు చేసి భయపెట్టాలని ప్రయత్నిం చేస్తున్నారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఇక ఇదిలా ఉంటే టీడీపీ ధర్నా పై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గాంధీ విగ్రహం మినహా మరెక్కడైన నిరసనకు అనుమతి ఇచ్చామని అందుకు టీడీపీ ఒప్పు కోలేదు అని అన్నారు. 5000 మందితో నిరసన చేస్తామనడం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది అని పేర్కొన్నారు. కోవిడ్, ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో  ఉన్నాయి అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలని చూచించాం అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు  తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ఏ ఆందోళన చేపట్టిన నిబంధనల మేరకు జరగాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: