టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళే ప్రయత్నం చేయగా ఆయనను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయనను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అధికార వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కూడా ఘాటు సమాధానం చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చీకటిరోజు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి ఆదేశాలతో, డీజీపీ నాయకత్వంలోనే పోలీసులు చంద్రబాబునాయుడిని  నిర్బంధించారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రపన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జగన్ ఆడుతున్న కుటిల, రాక్షసక్రీడలో భాగమే నేటి చంద్రబాబునాయుడి నిర్బంధం అని మండిపడ్డారు. కరోనా నిబంధనలు, ఎన్నికల నియమావళి చంద్రబాబునాయుడికి, టీడీపీవారికి మాత్రమే వర్తిస్తాయా? అని నిలదీశారు.

నిన్న తిరుపతిలో ర్యాలీ నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు అరెస్ట్ చేయలేదు?  అని  ప్రశ్నించారు. ఆయనకు కరోనా సోకదా...చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. అధికార పార్టీ వారికి జీ హూజూర్ అనడమే రాష్ట్ర పోలీస్ శాఖ పనా? అని ఆయన ప్రశ్నించారు. సవాంగ్ నాయకత్వంలో నిర్వీర్యమైన పోలీస్ శాఖ, ఆయన తర్వాత తిరిగి పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది అని వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడిని నిర్బంధించగలరు గానీ ఆయన ఆలోచనలను,ఆశయాలను నిలువరించగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నేలపైకూర్చుంటే తెలుగుజాతి కన్నీరు పెడుతోంది అని అన్నారు. ఎన్నికల కమిషనర్ గవర్నర్ ను కలిసినప్పటి నుంచీ మెత్తబడ్డాడని, ఈరోజు ఎస్ఈసీ నిర్వహించిన రాజకీయనేతల సమావేశం ఓ బూటకం, కంటితుడుపుచర్య అని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ  అరాచకాలపై  ప్రస్తావిస్తే,  ఎస్ఈసీ జీర్ణించుకోలేకపోయారు అని విమర్శించారు. సమావేశంలో టీడీపీ పట్ల ఎస్ఈసీ వ్యవహరశైలి అభ్యంతరకరం అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: