సాధారణంగా మనం గుడ్లగూబను చూస్తే భయపడి పోతూ ఉంటాము. ఎందుకంటే దానిని చూడాలంటే అందరికి ఒక రకమైన  అయిష్టత, భయం ఉంటుంది. అలాగే గుడ్లగూబలు ఎక్కువగా రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి. ఆ రాత్రి సమయంలో వాటిని చూడాలంటే మనకి వణుకు పుడుతుంది. వాటి కళ్ళు పెద్దవిగా ఉంటాయి. అలాగే వాటి అరుపులు కూడా గంబీరంగా, భయానకంగా ఉంటాయి. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గుర్తు ఉందా.. గుడ్లగూబని చూస్తే అది వచ్చి కళ్ళ గుడ్లు పీకేస్తుంది అనేవారు. దానితో మనం అందరం దానిని చూడడానికి భయం వేసి అమ్మ చాటున దాక్కునే వాళ్ళము.  కానీ, హిందూ శాస్త్ర ప్రకారం గుడ్లగూబ మరి అంతా చెడు శకునం ఏమి కాదట. గుడ్లగూబ శుభ శకునానికి ఒక సంకేతం అంట. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. !



ప్రస్తుత కాలంలో గుడ్లగూబలు అంతరించిపోతున్నాయి.చాలా తక్కువగా మనకి కనిపిస్తున్నాయి. అలాగే  గుడ్లగూబలను  చూడడానికి కానీ, పెంచుకోవడానికి కానీ చాలా మంది ఇష్టపడరు. కానీ,ఇవి  రైతులకు మాత్రం మంచి స్నేహితులు.మనలో చాలా మందికి ఉన్న నమ్మకం ఏమిటంటే, గుడ్లగూబను చూస్తే చెడు జరుగుతుంది అని, దాంతో గుడ్లగూబ పేరు వింటే చాలు.. వామ్మో గుడ్ల గూబ అని నోరు వెళ్లబెడతాం.




కానీ  హిందూ శాస్త్రాల ప్రకారం గుడ్లగూబ అనేది  లక్ష్మి దేవి వాహనం అంట. లక్ష్మి అమ్మవారు స్వామి వారితో వెళ్లాలనుకుంటే గరుడ వాహనం పైన, అలాగే ఒంటరిగా వెళ్ళవలసి వస్తే గుడ్లగూబ పైన ప్రయాణిస్తుందట.అలాగే, ఉల్లూక తంత్రం ప్రకారం నాలుగవ జాము సమయం లో గుడ్ల గూబ ఎవరి ఇంటిపైన అయినా వాలితే, వారి ఇంట్లో కాసుల  వర్షం కురుస్తుందట. అలాగే ఎవరి ఇంటి పరిసరాల్లో అయిన గుడ్లగూబ గూడు  ఏర్పరుచుకుంటే ఆ ఇంట్లోని కుటుంభ సభ్యులు సుఖ  సంతోషాలతో నివసిస్తారట..!!ఇక మీదట అయిన గుడ్ల గూబని చూసి బయపడకండి మిత్రులారా.. !


మరింత సమాచారం తెలుసుకోండి: